27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

కొందరు బీజేపీకి బీ-టీంగా వ్యవహరిస్తున్నారు

గుజరాత్ పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  గుజరాత్ కాంగ్రెస్ నేతలపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల తీరుపై  ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ  కాంగ్రెస్ నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే గుజరాత్ ప్రజల మనసు గెలుచుకోలేమన్నారు. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారని, కొందరు బీజేపీకి బీ-టీంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ వ్యాఖ్యనించారు.  బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 22 శాతం ఓట్లు పెరిగాయని, అసాధ్యం అనుకున్న దానిని వారు సాధించి చూపారన్నారు.  గుజరాత్ లో కాంగ్రెస్ కు 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. కానీ, నేతలు అందుకు భిన్నంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాగా, గుజరాత్ లో గత 30 ఏళ్లుగా కాంగ్రెస్  అధికారంలో లేకపోవడం గమనార్హం.

More articles

Latest article