28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మాట తప్పని మడమ తిప్పని నాయకుడు కేసీఆర్

Must read

📰 Generate e-Paper Clip

  • వరంగల్ సభకు నాయకులు,కార్యకర్తలు తరలిరావాలి.
  •  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్
  • మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ : పార్టీ ఆవిర్భావం జరిగి 25 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా వరంగల్ ఎల్కుతుర్తి లో ఈ నెల ఏప్రిల్ 27 న జరుగు బి.ఆర్.ఎస్ పార్టీ ఆవిర్భావ సభ కు బాల్కొండ నియోజకవర్గము నుండి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వరంగల్ పార్టీ  ఆవిర్భావ సభ విజయవంతం చేయడానికి  పార్టీ అధ్యక్షులు కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో వేల్పూర్ లో నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 60 ఏండ్లుగా ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణ విముక్తి కోసం ఆనాడు కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరినాడు అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఒప్పందాలు బుట్ట దాఖలు అయ్యి తెలంగాణ కు జరుగుతున్న అన్యాయాన్ని  అరికట్టాలంటే ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్ని సమస్యలకు పరిష్కారం అని,రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన అన్ని పదవులకు కేసీఆర్ రాజీనామా చేశారని తెలిపారు. 2001 లో పార్టీ స్థాపించి 14 ఏండ్లుగా శాంతి యుతంగా అనేక పంథాలో ఉద్యమాన్ని ముందుండి కేసీఆర్ నడిపించారని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్ణాలను ఒకతాటి పైకి తీసుకొచ్చి పార్లమెంటరీ పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాదించిన ఘనత కేసీఆర్ కి దక్కిందని పేర్కొన్నారు. వచ్చిన తెలంగాణ లో 10 ఏండ్లు మానవీయ కోణంలో  పరిపాలన అందించారు కేసీఆర్ అని అన్నారు. ఇటు పేద ప్రజల సంక్షేమం అటు అభివృద్ధి ని సమాంతరంగా పెరిగెత్తించి తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా కేసీఆర్ ఉంచారని  తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని, అధికారం కోల్పోయిన వేరవకుండా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సైనికులుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్నారని  తెలిపారు. అయినోడు కానోడు,తెలిసినోడు తెలనోడు బీఆర్ఎస్ పార్టీ పై నోటి కొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. వారందరికీ సమాధానం చెప్పటానికి వరంగల్ సభ వేదిక కానుందని తెలిపారు. నియోజకవర్గం ప్రతి గ్రామము నుండి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున వరంగల్ సభకు తరలి రావాలని కోరారు. రానున్న మూడు రోజుల్లో వరంగల్ సభను విజయవంతం చేయడానికి గ్రామ గ్రామన సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

More articles

Latest article