దేశంలో మహిళకు అవకాశం ఇవ్వని కేబినెట్ కేసీఆర్ కేబినెట్
మెదక్ ఎంపీ రఘునందన్ రావు
వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఘూటు వ్యాఖ్యలు చేశారు. బీసీ లకు అన్యాయం జరిగిందనీ కవితమ్మ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వని కేబినెట్ దేశంలో ఏదైనా ఉంటే అది కేసీఆర్ కేబినెట్ అని వ్యాఖ్యనించారు. కవితకు నీకు చిత్తశుద్ధి ఉంటే కేసీ ఆర్ తో మాట్లాడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇప్పించాలని రఘునందన్ రావు సూచించారు. డిల్లీ సీఎంగా బీజేపీ తరపున మహిళకు అవకాశం ఇచ్చామన్నారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున బీసీలకు లేదా మహిళలకు కేటాయించాలని కేసీఆర్ కు సూచించు కవిత అని రఘునందన్ అన్నారు.
