కామారెడ్డి, బతుకమ్మ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా , మాల్ ప్రాక్టీస్ జరుగకుండా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్ లలో ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన పరీక్షలో 9337 మంది విద్యార్థులకు గాను 8953 మంది విద్యార్థులు హాజరయ్యారని, 384 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఇందులో జనరల్ గ్రూప్ లో 7347 మందికి గాను 7116 మంది హాజరుకాగా, 231 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. వొకేషనల్ గ్రూప్ లో 1990 మంది విద్యార్థులకు గాను 1837 మంది హాజరు కాగా, 153 మంది గైర్హా జరయ్యారని తెలిపారు. పరీక్షలు సజావుగా నిర్వహించాలని, మాల్ ప్రాక్టీస్ కి ఆస్కారం ఇవ్వకూడదని తెలిపారు.
