నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా దీపావళి సందర్భంగా ఆరంభమైన “కరీంనగర్ టూ ముంబై స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నం: 01067” బుధవారం ఎనిమిది గంటలు ఆలస్యంగా తన గమ్యానికి (కరీంనగర్) కు చేరుకుంది. మంగళవారం లోకమాన్య తిలక్ ముంబై నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం కావాల్సింది పోయి 6:గంటలకు ప్లాట్ ఫాం పైకి వచ్చి, 6:48కి బయలు దేరింది. ముంబైలోనే మూడు గంటలకు పైగా ఆలస్యంగా నడవడం మొదలైంది. బండి దారిలో బహుశా పికప్ చేస్తుందేమోనని ప్రయాణికులు అనుకున్నారు. ఐతే ట్రైన్ లో ఉన్న టికెట్ మాస్టర్ నితేష్ గొయియా ను ప్రయాణికులు అడిగిన దానికి ఏడు గంటలు లెట్ గా నడుస్తుందని స్వయాన చెప్పారు. వాస్తవానికి రైలు “టైమ్ టేబుల్” ప్రకారం నడవక మన్నుతిన్న పాము వలె ట్రైన్ తమ వ్యవహారం కొనసాగించింది. ఇందూర్ కు 7గంటలు కాగా, కరీంనగర్ కు 8:గంటలు లెట్ గా చేరింది. ఐతే యాత్రికుల సమయానికి విలువ లేదా? ఇందులో ఒకవేళ సీఎం, పీఎం, మంత్రులు, రాజకీయ నాయకులు ప్రయాణించి ఉండివుంటే ట్రైన్ ఇలాగానే నడిచేదా అంటూ యాత్రికులు ప్రశ్నిస్తున్నారు. దీనికి రైల్వే శాఖ బృందం, సంబంధిత అధికారులు ప్రజలకు జవాబు ఇవ్వాని యాత్రికులు కోరుతున్నారు.
