29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

విద్యార్థిపై ఉపాధాయుడి దాష్టికం

Must read

📰 Generate e-Paper Clip

  • ఉపాధ్యాయుడిపై చర్యలు శూన్యం
  • డిప్యూటేషన్ పై పంపి చేతులు దులుపుకున్న వైనం

 

బోధన్, బతుకమ్మ :  బోధన్ పట్టణంలోని బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పై దాష్టికం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థి తండ్రి రాజేందర్ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మాత్రం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఉపాధ్యాయున్ని డిప్యూటేషన్ పై వేరే చోటికి పంపి చేతులు దులుపుకున్నారు. బీటి నగర్ హై స్కూల్  ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి దైవ రుచిత ఆరోగ్యం బాగోలేకపోవడంతో  స్కూలుకి వెళ్లలేదు. వినయ్ కుమార అనే ఉపాధ్యాయుడు విద్యార్థి మెడపై స్కూల్ బ్యాగ్ తగిలించి 100 గుంజీలు తీయించాడు. దీంతో మరుసటి రోజు నుంచి విద్యార్థి లేవలేని స్థితికి చేరకున్నాడు. విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడని నిలదీశారు. ప్రధానోపాధ్యాయుడు తప్పు జరిగిందని క్షమించాలని విద్యార్థి తండ్రికి తెలిపారు. దీంతో విద్యార్థి తండ్రి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ సదరు ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కానీ విద్యాశాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సదరు ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్ పై వేరే పాఠశాలకు పంపారు.

More articles

Latest article