నిజామాబాద్ కు 7గంటలు ఆలస్యంగా కరీంనగర్ రైలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దసరా దీపావళి సందర్భంగా ఆరంభమైన "కరీంనగర్ టూ ముంబై స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నం: 01067" బుధవారం ఎనిమిది గంటలు ఆలస్యంగా తన గమ్యానికి (కరీంనగర్) కు చేరుకుంది. మంగళవారం లోకమాన్య తిలక్ ముంబై నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు ఆరంభం కావాల్సింది పోయి 6:గంటలకు ప్లాట్ ఫాం పైకి వచ్చి, 6:48కి బయలు దేరింది. ముంబైలోనే మూడు గంటలకు పైగా ఆలస్యంగా నడవడం మొదలైంది. బండి దారిలో బహుశా పికప్ చేస్తుందేమోనని ప్రయాణికులు అనుకున్నారు. ఐతే ట్రైన్...