బాన్సువాడ, బతుకమ్మ : వర్ని మండల పరిధిలోని కూనిపూర్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీకి చెందిన మండల సీనియర్ కార్యకర్తలు శివ, వర్ని మండల బీజేపీ నాయకులు, నవీన్ రెడ్డి, సతీష్, దత్తు, మహేందర్ రెడ్డి, బాలు, ప్రవీణ్ గౌడ్, శేఖర్, గోవుర్ నరేష్ బాన్సువాడ లోని నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోచారం భాస్కర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సంధర్బంగా పార్టీ కండువా కప్పి పార్టీ లోకి పోచారం భాస్కర్ రెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్ది,సర్పంచ్ అభ్యర్థి గిరి సాయులు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కృష్ణరెడ్డి, వర్ని మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
