27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఈ పాఠశాలలో ప్రతీ గోడ పాఠం చెబుతోంది

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ చదువులకు తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న  ఉపాధ్యాయులు కొత్తగా ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని తెలుపడంలొ తన సందేహం లేదు. మోర్తాడ్ మండలంలోని షేట్ పల్లీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థికి అక్కడ ఉన్న  ప్రతి గోడ విద్యార్థులకు పాఠం చెప్పే విధంగా పాఠశాల గదుల గోడలను తీర్చిదిద్దినారు. తరగతి గదిలో ఉన్న బ్లాక్ బోర్డ్ చుట్టూ అక్షరాలతో అందంగా పదాలు వచ్చేవిధముగా రంగు రంగు కాగితాలతో ప్రత్యేకంగా అలంకరించారు. గదిలో ఎక్కడ కృచున్న విద్యార్థి దృష్టి చదువుపై శ్రద్ధ కలిగే విధముగా తరగతి గది నాలుగు దిక్కుల పిల్లల కథల పుస్తకాలు దర్శనం ఇస్తాయి. రంగు రంగుల కాగితాలపై పిల్లల పుస్తకాల్లో ఉన్న తెలుగు, ఆంగ్లం, లెక్కలకు సంబంధించిన ఎక్కాలు తదితర పదాలను, చిత్రాలను చూసి నేర్చుకునే విధముగా అందముగా తయారు చేశారు. ఈ పరికరాలకు కావలసిన సామాగ్రిని ఉపాధ్యాయులు కిరణ్ కుమార్, సుమతి సొంత డబ్బులతో తయారు చేస్తున్నారు. ప్రతి గదిని అందంగా ఆకర్షనీయంగా అలంకరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Every wall in this school tells a lesson.

Every wall in this school tells a lesson.

Every wall in this school tells a lesson.

More articles

Latest article