ఎల్లారెడ్డి, బతుకమ్మ : సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు తరలింపును అరికట్టేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఎల్లారెడ్డి పర్యవేక్షణలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్ కలిసి రోడ్లపై వాహనాల తనిఖీలు చేపట్టారు. అధికారుల సమాచారం మేరకు.. ఎవరైనా అక్రమంగా డబ్బులు తరలిస్తే చట్టం ప్రకారం వెంటనే సీజ్ చేస్తాం అని తెలిపారు. తనిఖీల సమయంలో రెండు చౌరస్తాల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, కార్లు, బైకులు, ఆటోలు, గూడ్స్ వాహనాలను అధికారులు వివరంగా పరిశీలించారు. ప్రజలకు ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
