25 C
Hyderabad

జిల్లాలో జూదం పేకాట నిర్మూలనకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు

Four special police teams formed to eradicate gambling and card games in the district

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 24 గంటల జూద నిర్వాహకులపై పోలీసుల నిఘా

. . . జూదం నిర్వహించే స్థావరాలపై ఆకస్మిక దాడులు

 . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

 కామారెడ్డి, బతుకమ్మ:

జూదానికి బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దు.. కుటుంబాల ను రోడ్డున పడేయొద్దు అని కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర పిలుపు నిచ్చారు. జూదం జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యసనం.. యువత బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని సూచించారు. దీపావళి సందర్భంగా జిల్లాలో జూదం. పేకాట కార్యకలాపాలను పూర్తిస్థాయిలో అరికట్టి లక్ష్యంతో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బృందాలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటూ జిల్లావ్యాప్తంగా జూదం నిర్వహించే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు సమాచారాన్ని సేకరిస్తారు ఎక్కడైనా జూదం, పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాలకు చేరుకుని ఆకస్మిక దాడులు నిర్వహిస్తాయి అన్నారు. జూదం నిర్వాహకులు, పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు అని హెచ్చరించారు. కష్టపడకుండా తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశతో జూదం కు అలవాటుపడుతున్న కొందరు తమ జీవితాలను (పేకాట), కుటుంబ భవిష్యత్తును ప్రమాదంలోకి పెట్టుకుంటున్నారని తెలిపారు.జూదంలో గెలిచి సులభంగా డబ్బు సంపాదించవచ్చని భ్రమతో కష్టపడి సంపాదించిన సొమ్మును కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారు, ఈ వ్యసనం కారణంగా కుటుంబంలో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే కుటుంబాలు విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. జుదం సంపాదనకు మార్గం కాదని జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వ్యసనం ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా యువత క్షణికమైన ఆశలకు, అత్యాశకు లోనై జూదానికి బానిస లై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. జూదం (పేకాట) కేసులో పట్టుబడి కేసులు నమోదైతే అవి పోలీసు రికార్డుల్లో నమోదవుతాయి, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు జరిగే పోలీసు వెరిఫికేషన్ గత కేసుల వివరాలు పరిశీలనకు వచ్చే అవకాశం ఉందని, ద్వారా ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడవచ్చని హెచ్చరించారు. కేసుల దర్యాప్తులో చట్టప్రకారం వేలిముద్రలు సేకరించి పోలీసు రికార్డుల్లో భద్రపరిచే క్షణిక ఆనంద . అవకాశం ఉంటుందని తెలిపారుం కోసం భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని యువతకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా జూదం, పెకాట ఆడుతున్న లేదా నిర్వహిస్తున్నా ఉపేక్షించేది లేదని, అటువంటి కార్యకలాపాలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం (ఏకాట) నిర్వహిస్తున్నట్లు గుర్తించినా లేదా సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712686133 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు .జూదం, పేకాట నిర్మూలనలో ప్రజలు కూడా భాగస్వాములై పోలీసులు సహకరించాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ తమ కుటుంబానికి, సమాజానికి మంచి భవిష్యత్తును అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article