24.5 C
Hyderabad
Friday, July 31, 2026

పి డి ఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

 

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పి డి ఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలు వరంగల్ పట్టణంలో  జనవరి  5, 6 ,7 తేదీల్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది ,మొదటి రోజు వేల మంది విద్యార్థులతో ర్యాలీ బహిరంగ, రెండు రోజుల పాటు ప్రతినిధుల సభలు జరిగాయి .నిజామాబాద్  జిల్లా విద్యార్థి ఉద్యమ ప్రాధాన్యత గురించి మరియు  తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం, హరిచరణ్ మార్వాడి  కాలేజ్ భూములు పోరాటం ,స్థానిక సమస్యలు ,సంక్షేమ హాస్టల్స్ ,జి జి కాలేజ్ సమస్యలు ఇంజనీరింగ్ కళాశాల కోసం చేసిన ఉద్యమాలలో జన్నారపు రాజేశ్వర్ పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మహాసభ ఏకగ్రీవంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్ ను ఎన్నుకోవడం జరిగిందనీ పి డి ఎస్ యూ నగర ప్రధాన కార్యదర్శి సాయి కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో  విద్యా వ్యతిరేక విధానాలపై ,విద్యారంగ  సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోతానని, స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతననీ తెలిపారు.

Jannarupu Rajeshwar unanimously elected as PDSU state vice-president

More articles

Latest article