24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఒకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : మద్యం మత్తులో డయల్ 100 కి కాల్ చేసిన ఒకరిరి రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీన రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన హబీబ్ ఖాన్  (37) అను అతను మద్యం మత్తులో అనవసరంగా డయల్ 100కి కాల్ చేసి పోలీసుల విధులను దుర్వినియోగం చేశాడు. అలా పలుమార్లు డయల్ 100కి అనవసరంగా కాల్ చేసినందుకు మంగళవారం అతని పైన కేసు నమోదు చేసి గౌరవ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హజరు పరిచారు. మేజిస్ట్రేట్ రెండు రోజులు జైలు శిక్ష విధించినట్లు తీర్పు వెల్లడించారని ఎస్సై తెలిపారు.

More articles

Latest article