27.4 C
Hyderabad

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నిందితుడికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న పేర్కొన్నారు. రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా రుద్రూర్ గ్రామానికి చెందిన షేక్ మహబూబ్ (52) అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆ వ్యక్తిని మంగళవారం బోధన్ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు.

More articles

Latest article