నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో న్యాయస్థానం నలుగురికి జైలు శిక్ష విధించింది. నగరంలోని ఐదో టౌన్, ఆరో టౌన్ పోలీసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఐదో టౌన్ పరిధిలో గంగా ప్రసాద్, సంజయ్ దిగంబర్, ఆరో టౌన్ పరిధిలో జహీర్ ఖాన్, ఇమ్రాన్ అలీ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ఎస్సైలు గంగాధర్, వెంకట్ రావు తెలిపారు. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సెకండ్ క్లాస్ మెజిస్ర్టేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చగా, నలుగరికి రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని, ప్రతి ఒక్కరూ మోటార్ వెహికిల్ చట్టం నిబంధనలను పాటించాలని ఎస్సైలు సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.