నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: స్వాతంత్ర పోరాటంలో, ఆ తరువాత కాంగ్రెస్ అందించిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తుంది, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ‘జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్’ నిర్వహిస్తున్నామని సిరిసిల్ల గ్రంథాలయ సంస్త చైర్మన్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, నుడా చైర్మన్ కేశ వేణు అధ్యక్షతన అర్బన్ నియోజకవర్గ జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా అర్బన్ నియోజకవర్గ కార్యక్రమ ఇన్చార్జి సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కార్యక్రమ రాష్ట్ర ప్రతినిధి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, అబ్దుల్ ఎజాజ్, బొబ్బిలి రామకృష్ణ, తంబాకు చంద్రకళ, పోల ఉష, విజయలక్ష్మి,,అంతరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, వినయ్, యెండల కిషన్, జియా, నరేందర్ గౌడ్, లవంగ ప్రమోద్, సంగెం సాయిలు తదితరులు పాల్గొన్నారు.