న్యూఢిల్లీ, బతుకమ్మ: ఇండియా అలయన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన, పార్లమెంట్ మార్చ్ లో ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకట స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్రాహుల్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ అవలంబిస్తున్న జాతీయ విద్యా విధానం యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, విద్యా కాషాయీకరణ తదితర అంశాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న వేణురాజ్ తోపాటు నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
