26.7 C
Hyderabad

జగిత్యాల గడ్డ బిఆర్ఎస్ కు అడ్డా

Must read

📰 Generate e-Paper Clip

. . . 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహనికి ప్రతిష్టపనకు భూమి పూజ

. . . ధరూర్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఘన స్వాగతం

జగిత్యాల ,బతుకమ్మ:

జగి త్యాల అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్డా అని మీ అందర్నీ చూస్తే తెలిసిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పర్యటన సంధర్బంగా ధరూర్‌ బైపాస్‌ వద్ద గజమాలతో ఘన స్వాగతం పలికారు. బైపాస్‌ వద్ద ఉన్న అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిళల తో కలిసి కవిత బతుకమ్మ ఆడారు. ప్రభుత్వ జీవోలను ధిక్కరించి 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపనకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భూమి పూజ చేసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పాలనలో తెలం గాణ తల్లిని, బతుకమ్మను దూరం చేస్తున్నారని, మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకపోవడంపై మహిళలు మండిపడుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ ఏమైందని రేవంత్‌ సర్కార్‌ను నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లినే గ్రామ గ్రామాన ప్రతిష్టించుకుంటామని గెజిట్ ఇచ్చినా, కేసులు పెట్టిన భయపడేది లేదు అన్నారు. మా అందరికీ ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపిన ఉద్యమ తెలంగాణ తల్లినే ఆరాధిస్తాం  అని, తెలంగాణ తల్లిలోని బతుకమ్మను కాపాడుకుంటాం అని తెలిపారు. తెలంగాణ అస్తిత్వం పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని గ్రామ గ్రామాన ఎండగడుతాం అని కవిత అన్నారు.

 

Jagityala Gadda Adda to BRS

More articles

Latest article