. . . ఓక్కటే ఇంట్లో 10 నుంచి 20 ఓట్లు ఎలా నమోదు అయ్యాయి
. . . బాపూజీ వచనాలే వచనాలయ పరిరక్షణ సమితి నేతలు
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
బాపూజీ వచనాలే వచనాలయం పాలకవర్గం ఎన్నికలు అసెంబ్లి ఎన్నికలను తలపించాయని, లిక్కర్ కాంట్రాక్టర్లు విచ్చలవిడిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఒకే ఇంట్లో 20 ఓట్లు ఇంకో ఇంట్లో 10 ఓట్ల లెక్కన దొంగ ఓట్లు నమోదు చేశారని బాపూజీ వచనాలయం పరిరక్షణ సమితి నేతలు ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో బాపూజీ వచనాలయ పరిరక్షణ సమితి కన్వీనర్ కోనేరు సాయికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం పార్టీ కార్యదర్శి రమేష్ బాబు , సిసిఐ జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిపిఐఎంల్ న్యూ డేమోక్రసీ శివ లు మాట్లాడుతు… ప్రజలకు అందుబాటులో జిల్లా కేంద్రం నడిబొడ్డులో ఉన్నాయి వచనాలయన్నీ కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. వచనాలయంలో వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని వీరికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రతి కార్యక్రమంలో కలిసి పోరాడుతాం అన్నారు. గతంలో దోమకొండ సంస్థానం నుండి విలువైన పుస్తకాలను ఈ యొక్క బాపూజీ వచనాలయానికి దానంగా ఇవ్వడం జరిగిందని అవి దాదాపు 30వేల పుస్తకాలుగా ఉంటాయని తెలిసిందని అన్నారు.ఇంత విలువైన ఈ బాపూజీ వచనాలయ కొంతమంది తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎందుకు ఇంత అష్ట కష్టాలు పడుతూ ఎన్నికల్లో ఇతరులు పోటీ చేయించ నీయకుండా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంటూ నిబంధనలు ఎందుకు పెడుతున్నారు దీని వెనుక మతలవేందో ప్రజలకు తెలియజేయడంలో పరిరక్షణ సమితి చేసే పోరాటంలో మేం కూడా భాగం పంచుకుంటామని తెలిపారు. పౌర హక్కుల సంఘం నాయకులు ప్రముఖ న్యాయవాది ఆల్గో రవీందర్ మాట్లాడుతూ ప్రజలు ఇంతవరకు ఈ బాపూజీ వచనాలయం లో ఏం జరుగుతుందో తెలియదని కానీ ఎన్నిక ద్వారా ప్రజలకు పట్టణ ప్రజలకు వాస్తవాలు కొన్ని బయటకు వస్తున్నాయని పూర్తి వాస్తవాలు బయటకు రప్పించి ఈ వచనాలయాన్ని పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం వెళ్లే వారికి ఉపయోగపడేటట్లు చేయాలనిఅన్నారు. పిడిఎస్యు విద్యార్థి నాయకుడు గణేష్ మాట్లాడుతూ గతంలో ఖలీల్ వాడి గ్రౌండ్ కోసం విద్యార్థులు సిటిజన్స్ కమిటీ కోలేరు సాయికుమార్ నాయకత్వంలో పోరాడిందని ఇప్పుడు కూడా ఈ బాపూజీ వచనాల కోసం స్థలం కోసం అవినీతిపరులకు , కబ్జాదారులకు వ్యతిరేకంగా విద్యార్థులం అండగా ఉంటామని తెలిపారు.
