కామారెడ్డి, బతుకమ్మ : దళిత స్పీకర్ ను అవమానించిన జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి బర్తరాఫ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా మహ్మ ద్ నగర్ మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు కేటీఆర్, జగదీష్ రెడ్డి ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు దళితులను మోసం చేసిన పార్టీ అని అన్నారు. ఇప్పుడు అదే దళితున్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్పీకర్ గా నియమించి శాసనసభకు పెద్ద మనుషులా ఉండడం కెసిఆర్, కేటీఆర్ లకు నచ్చడం లేదని అన్నారు. జగదీశ్వర్ రెడ్డి దళిత స్పీకర్ అయినా గడ్డం ప్రసాద్ ను కించపరచడం సిగ్గుచేటని, జగదీశ్వర్ రెడ్డిని శాసనసభ నుండి బర్తరఫ్ చేసి, బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లయ్య గారి ఆకాష్, మాజీ ఎంపీటీసీ నాగభూషణం గౌడ్, మాజీ ఎంపిటిసి లోకన్ నాయక్, మాజీ సర్పంచ్ గింగి రమేష్, గొట్టం నర్సింలు,చాకలి గంగారాం, సంతోష్ రాథోడ్, కలిక్, తదితరులు పాల్గొన్నారు.
