- ఆధిపత్య పోరు తాళలేక నిరాధార ఆరోపణలు
- నువ్వు ప్రకటించిన 17న వేల్పూర్ రా, మేము వస్తాం వేల మంది బాధితులతో
- డీసీసీబీ డైరెక్టర్.శేఖర్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : మీ పార్టీ సాధ్యం కానీ హామీలను ఇచ్చి, నెరవేర్చలేక ప్రజల దృష్టిని మరల్చడానికి మనాల మోహన్ రెడ్డి చేస్తున్న చిల్లర, చౌకబారు రాజకీయాలు మానుకుంటే మంచిదని డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి హితవు పలికారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పై మనాల చేసిన నిరాధార ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం మండల కేంద్రం లోని బీయర్ యస్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మానాల మోహన్ రెడ్డి కానిస్టెన్సీలో ఆధిపత్య పోరు తాళలేక, మతిభ్రమించి ఎమ్మెల్యే పైన నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మార్చాలాడానికి నివ్వు ప్రకటించిన ఈ నెల 17 న వేల్పూర్ కార్యక్రమం కు లబ్ధిదారులను తీసుకురావాలని అందుకు మేము కూడా రెడీగా ఉన్నామని, మేము లబ్ధిపొందని వారిని అందరిని తీసుకొని వేల్పూర్ కు వస్తామని అన్నారు. 5 లక్షల ఎక్స్ గ్రేసియా రాని వారిని, రైతు భీమా రానివారిని, రూ. 2 లక్షల ఋణ మాఫీ కానివారిని, రైతు బంద్ రాని వారిని, వడ్ల బోనస్ రాని వారిని, జీరో కరెంట్ బిల్లులు, సిలండర్ సబ్సడి రాని వారందరిని తీసుకొని వస్తామని తెలిపారు. ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గల్ఫ్ కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఏమైందని, గుల్ఫ్ భాధిత కుటుంబాలకు మీ గవర్నమెంట్ ఇస్తానన్న ఎక్స్ గ్రేసియా ఏమైందని అడగడం తప్పా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, కానిస్టెన్సీ ఎమ్మెల్యే గా, ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ప్రభుత్వాన్ని నిలదీయడం ఆయన భాద్యత అని అన్నారు.ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందకపోతే ప్రజల పక్షాన పోరాడేది ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులే నన్న విషయం మానాల కు తెల్వకపోవడం ఆయన అవివేక రాజకీయానికి నిదర్శనమని ఆయన ఏద్దేవా చేశారు. మీ ప్రభుత్వం అమలు చేస్తామన్న పథకాలు అందినాయని నిరూపించుకుంటావా? లేకపోతే, నువ్వు బేషరత్ గా ప్రజలకు క్షేమపణ చెప్పి రాజకీయ సన్యాసం తీసుకుంటావా?మానాల ను శేఖర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రెస్ మీట్ లో బీయర్ యస్ ముఖ్య నాయకులు నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు నగాధర్ రెడ్డి,రేగుంట దేవేందర్,కల్లెడ ఏలీయా,బద్దం నర్సారెడ్డి,బద్దం రవి,సామ వెంకట్ రెడ్డి,మిట్టపల్లి మహిపాల్, శర్మ నాయక్,పసుల ముత్తెన్న,యేలేటి రమేష్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,లింబారెడ్డి,డొల్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
