గంజాయికి అలవాటు పడిన 31 మందికి కౌన్సిలింగ్

0 14,772

 కామారెడ్డి, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లాలో గంజాయికి అలవాటు పడిన 31 మంది యువతకు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల ఒక గంజాయి విక్రేతను పట్టుకోగా తన వద్ధ  గంజాయి కోనుగోలు చేసి సేవించిన వారి వివరాలను సేకరించింది ఎక్సైజ్. వారికి మంగళవారం కామారెడ్డి ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో గంజాయి సేవించిన యువతతో పాటు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, ప్రభుత్వ ఆసుపత్రి సైకియాట్రిస్ట్ డాక్టర్ రమణ లు కామారెడ్డి మున్సిపాల్టి పరిధిలోని 8, చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన 14 మంది, రాజం పేట్ కు చెందిన 6 గురు, రామేశ్వర్ పల్లికి చెందిన 3 కి కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి, మత్తు పధార్థాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. అదే విధంగా శారిరకంగా కలిగే నష్టాలను, సమాజంలో జరుగు అనార్థాలను వివరించారు. ఈ సంధర్బంగా మత్తు పధార్ధాలకు దూరంగా ఉంటామని వారిచేత ప్రతిన చేయించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి సిఐ సంపత్ క్రిష్ణ, డిటిఎప్ సిఐ సుందర్ క్రిష్ణ, ఎస్ఐలు విక్రం, శ్రీనివాస్  సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.