ఇండస్ట్రీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలి

0 1,547

నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ను ఇండస్ర్టీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని, నగరం చుట్టూ 15 కిలో మీటర్ల లోపు వరకు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ను స్థాపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కోరారు. అధ్యక్షుడు ఆర్ జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమొరాండం సమర్పించారు. ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ తో పరిశ్రమలు రావడంతోపాటు వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్ డబ్లింగ్ చేస్తూ గుడ్స్ షెడ్ కారిడార్ నిర్మించాలని తద్వారా వ్యాపార రంగం అభివృద్ధి  చెందుతుందని విన్నవించారు. అలాగే కంటైనర్ డిపోను నిర్మిస్తే ఇక్కడ తయారైన వస్తువులను ఇతర దేశాలకు సులభంగా ఎగుమతి చేయొచ్చన్నారు. స్పైస్ బోర్డు  ఏర్పాటు అనంతరం  పసుపు, వరి,  తృణ ధాన్యాలు సాగు చేసే రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికంగా ఎన్ఏబీఎల్ లాబొరేటరీ స్థాపిస్తే ఇక్కడి పంట దిగుబడగులను ఉన్నత ప్రమాణాలతో ఎగుమతి చెయొచ్చని, ఈశాన్య రాష్ట్రాలకు, గుజరాత్ రాష్ట్రానికి ఇస్తున్న సబ్సిడీలు నిజామాబాద్ కి సైతం ఇస్తే ఇక్కడ పరిశ్రమలు వృద్ధి చెందుతాయని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతు మాట్లాడుతూ.. ఇండస్ర్టీయల్, బ్యాంకర్ల సమావేశాలకు నిర్వహించిన సమయంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీని ఆహ్వానించి తగిన సలహాలు, సూచనలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ ను కలిసిన వారిలో సభ్యులు శ్రీనివాసరావు, గంగాధర్ రావు, అంబోజి హరిప్రసాద్, జామిల్  సైబర్ న్యాయవాది, పూర్వ అధ్యక్షుడు వెంకట నర్సాగౌడ్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.