30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

తప్పు చేయని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?

Must read

📰 Generate e-Paper Clip

. కేటీఆర్ కేసును ఎదుర్కోవాలి

. బీఆర్ఎస్ భూస్థాపితమైంది

. రాష్ర్టంలో ఇందిరమ్మ పాలన సాగుతోంది

. విలేకరుల సమాశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

బాన్సువాడ, బతుకమ్మ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హై కోర్టు కొట్టేవేసిందని, తప్పు చేయని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ తో కలిసి మంత్రి బాన్సువాడ పట్టణంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ ఆశలు అడియాసలు అయ్యాయని, ఆ పార్టీ ఇప్పటికే భూస్థాపితమైందని అన్నారు. అధికారం కోల్పోయామనే అక్కసుతో ప్రభుత్వం బురదజల్లుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు పట్ట కట్టారని అన్నారు. దేశానికి, రాష్ర్టానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతోందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాన్యులు ప్రగతిభవన్, సచివాలయంలోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావని, ఇప్పుడు స్వేచ్ఛగా మంత్రులను, ఉన్నతాధికారులను కలుస్తున్నారన్నారు.

More articles

Latest article