ఇండస్ట్రీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ ను ఇండస్ర్టీయల్ కారిడార్ గా అభివృద్ధి చేయాలని, నగరం చుట్టూ 15 కిలో మీటర్ల లోపు వరకు ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ను స్థాపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు కోరారు. అధ్యక్షుడు ఆర్ జగదీశ్వర్ రావు ఆధ్వర్యంలో కలెక్టర్ కు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై మెమొరాండం సమర్పించారు. ఇండస్ట్రియల్ కారిడార్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ తో పరిశ్రమలు రావడంతోపాటు వ్యాపారాలు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు. సికింద్రాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి రైల్వే లైన్...