24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా బిజెపితో నే సాధ్యం

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు, పట్టభద్రులు ఆలోచించి ఓటెయ్యాలి
  • కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండలిలో ప్రశ్నించే సత్తా కేవలం బిజెపి కి మాత్రమే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా  శనివారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతూ… అసెంబ్లీ ఎన్నికల్లో  అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతుందని ఆరోపించారు. శాసనమండలిలో  ప్రతిపక్ష హోదా లేకుండా మండలి ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసి తెలంగాణ అభివృద్ధి దిశగా సాగాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. వంద రోజుల్లో అమలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 400 రోజులైనా అమలు కావడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో సబ్బండ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని ఆయన అన్నారు. బిజెపితోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారని ఎన్నికలలో ఇచ్చిన ఎన్ని హామీలు అమలు చేశారని మీతో ఎందుకు చర్చకు రావాలని అన్నారు. తాను విద్యార్థి దశలో ఉన్నప్పటినుండి నిజామాబాద్ జిల్లాకి పసుపు బోర్డు డిమాండ్ ఉందని ప్రస్తుతం నరేంద్ర మోదీ,ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితోని సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పసుపు బోర్డు కల సాకారం అయ్యిందన్నారు. రానున్న రోజులలో పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా కులగణనకు బిజెపి వ్యతిరేకం కాదని బీసీ సామాజిక వర్గాలను అన్యాయం చేసే విధంగా ముస్లిం లను బిసిలలో చేర్చడం వ్యతిరేకిస్తున్నామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బిజెపి ముందడుగు వేస్తుందని అందుకోసమే రాష్ట్ర నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ట్రాలకు పరిమితమైందని ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాలలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేధావులు నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, విద్యావంతులు ఏకమై బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని దిశ నిర్దేశం చేశారు. అనంతరం జిల్లాకు పసుపు బోర్డు తెచ్చిన ఎంపీ అరవింద్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నిర్మల్ ఎమ్మెల్యే, శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article