24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఊపందుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ:  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని చిక్కడ్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సి అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఉద్యోగాలు, చేయూత పథకాలు ఇలా అనేక లక్ష్యాలను నరేందర్ రెడ్డిని గెలిపించుకోవటం వల్ల మన వాక్కును మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం వల్ల మన ఉద్యోగాలు, అనేక యువతకు సంబందించిన పథకాలు సాధించుకుందామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో చిక్కడపల్లి గ్రామ అధ్యక్షులు దువ్వ.రవికుమార్, కొండ. సుదర్శన్ గౌడ్, బేగరి భూమయ్య, రాము, సంజీవ్,  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article