. . . అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
బాలల హక్కులను కాపాడడం మనందరి బాధ్యతని, నేటి బాలలను రేపటి పౌరులుగా మనమే తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఏప్రిల్ 27 నుండి మే 2 వరకు మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల భద్రత డ్రగ్స్ రహిత తెలంగాణ సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం 18 సంవత్సరాలు పై బడిన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ (సిసిఐ) పిల్లల కోసం ఆఫ్టర్ కేర్ ప్రోగ్రాం నిర్వహించారు. స్థానిక ఐడిఓసి ప్రాంగణంలో అడిషనల్ కలెక్టర్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ చేతుల మీదుగా మానవతా సదన్ లో చదువుకుంటున్న పిల్లలకి కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను, ఆర్ఫన్, బ్యాంక్ అకౌంట్ లను అందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాలల భద్రత రక్షణ కొరకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనందరి సహకారం అవసరమని తెలిపారు. బాలలకి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకి అందుకోవాలని పిల్లలకు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి పద్మ మాట్లాడుతూ వారం రోజుల పాటు బాలల భద్రత రక్షణ కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం బాలల హక్కులు, బాల కార్మిక నిర్మూలన పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి సాయన్న, డి ఎం హెచ్ ఓ రాజశ్రీ, డి సి పి ఓ చైతన్యకుమార్, మానవతా సదన్ ఇంచార్జి రమేష్, శ్రీ హరి చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.
