30.9 C
Hyderabad
Monday, August 3, 2026

భరోసా సెంటర్ ఆధ్వర్యంలో చైల్డ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం సోమవారం బ్రోగాం(పి) గ్రామపంచాయతీ పరిధిలో, డి.ఆర్.డి.ఏ ఐకేపీ మండల సమాఖ్య సమావేశంలో రెండు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Awareness programs on child safety under the auspices of Bharosa Center

 

ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, భరోసా సెంటర్ సేవలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు, జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్రోగాం(పి) కార్పొరేటర్ నరేష్, డి.ఆర్.డి.ఏ ఐకేపీ ఏపీఎం శారద, భరోసా సిబ్బంది డబ్ల్యూఎస్‌ఐ పుష్పావతి, కో-ఆర్డినేటర్ రోజా, సపోర్ట్ పర్సన్ సవిత, ఏఎన్‌ఎం మమత, ఆర్‌పీలు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article