27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రోగ్రాం ఆఫీసర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్

 

డిచ్ పల్లి, బతుకమ్మ :

 

పర్యావరణ పరిరక్షణ మనందరి సామాజిక బాధ్యత అని ప్రోగ్రాం ఆఫీసర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్-II, డిచ్‌పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరాన్ని 4 వ రోజైన సోమవారం కూడా ఉత్సాహంగా కొనసాగించారు. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం జాతీయ సేవా పథకం లక్ష్యమైన సామాజిక సేవా భావన, యువత అభివృద్ధికి తమ నిబద్ధతను మరింత బలపరిచిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్ల వద్ద ఎన్ఎస్ఎస్ స్వచ్ఛంద సేవకులు బ్లాక్ ప్లమ్, జామ, టెర్మినాలియా, టీక్, ఉసిరి వంటి ఔషధ, పర్యావరణానికి మేలు చేసే మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను చాటారు. గో గ్రీన్, బ్రీత్ క్లీన్వంటి నినాదాలతో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో పర్యావరణ బాధ్యతపై చైతన్యం కల్పించారు. మిషన్ భగీరథ విభాగం/గ్రామీణ నీటి సరఫరా, తెలంగాణ ప్రభుత్వానికి చెందిన జిల్లా స్థాయి వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబ్‌కు చెందిన వాటర్ కన్సల్టెంట్ ఎన్.లక్ష్మీనారాయణ తాగునీటి పరీక్షల ప్రాముఖ్యత, ఆరోగ్యంపై దాని ప్రభావంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాలు ఎన్ఎస్ఎస్ యూనిట్-II ప్రోగ్రాం ఆఫీసర్ డా.అహ్మద్ అబ్దుల్ హలీమ్ ఖాన్ పర్యవేక్షణలో నిర్వహించబడగా, గ్రామ పాఠశాల పిల్లల కోసం సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ఎన్ఎస్ఎస్ ఇతర యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఎన్.స్వామి, డా.శ్రీనివాస్, డా.నరసయ్య హాజరయ్యారు.

More articles

Latest article