రైతులు పసుపు లో సస్య రక్షణ చర్యలు చే పట్టడం అత్యవసరం

బతుకమ్మ, ఏర్గట్ల : వర్షాలు పసుపు రైతులకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నీరు చేనులో ఉబికి రావడంతో పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముసురు వానలతో వ్యవసాయ క్షేత్రాలు నీటితో నిండిపోవడంతో పసుపు పంట తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని ఉద్యాన శాఖ అధికారి రుద్ర వినాయక్ పేర్కొన్నారు. ఏర్గట్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో తెగుళ్ల బారిన పడ్డ పసుపు పంటను పసుపు పరిశోధన స్థానం కమ్మర్ పల్లి శాస్త్రవేత్త డా.మహేందర్ బుధవారం ఆయన పరిశీలించి పెద్ద మొత్తంలో పంటలకు తాటాకు మచ్చ...