- కంకణాల రాజేశ్వర్
భీమ్ గల్, బతుకమ్మ : తమతో చదువుకున్న వ్యక్తి మరణించడం, ఆయన జ్ఞాపకార్థం వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం అభినందనీయమని పూర్వ ఉపాధ్యాయుడు, కవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ అన్నారు. పట్టణంలోని అంగడి బజార్ శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాల 2004-05 ఎస్సెస్సి పూర్వ విద్యార్థి దివంగత నిచ్చెం వినోద్ జ్ఞాపకార్థం ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ శివారులో గల లాలన వృద్ధాశ్రమం లో పూర్వ విద్యార్థుల మిత్రబృందం ఆధ్వర్యంలో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.నిచ్చెం వినోద్ గతించి మూడు మాసాలు సమీపిస్తున్న దృష్ట్యా అన్నదానం నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక పూర్వ ఉపాధ్యాయుడు కంకణాల రాజేశ్వర్ హాజరై మాట్లాడారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం మిన్న అని అన్నారు. నిచ్చెం వినోద్ ఆత్మ శాంతించాలని, ఏ లోకంలో ఉన్నా నీ జ్ఞాపకాలు సదా సహ విద్యార్థుల మదిలో మెదులుతూనే ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వాక మహేష్, సుంకరి సురేష్, తోట సతీష్, కావటిపురం శివ, తిరునగరి రాకేష్, యాదగిరి వంశీ, గంగం నరేష్, దయ్య అనిల్, చాతిరి సాయిబాబా, కాసర్ల వినోద్, ప్రవాస భారతీయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు.
