- టీయూసీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి ఆర్.రమేష్
భీమ్ గల్, బతుకమ్మ : హమాలీలకు ఉపాధి, భద్రతతో కూడిన సమగ్రమైన చట్టాన్ని ఏర్పాటు చేసి, హమాలీలకు ఈ పీ ఎఫ్, ఈ ఎస్ ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలని టీయు సీఐ నిజామాబాద్ రూరల్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సెక్రటరీ ఆర్. రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయు సీఐ) రాష్ట్ర మహాసభ పిలుపులో భాగంగా బీమ్ గల్ కొత్త బస్ స్టాండ్ లో హమాలీ కార్మికుల సమావేశంను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా వివిధ రంగాల్లో వ్యవసాయ మార్కెట్ రైస్ మిల్స్, సివిల్ సప్లై, ఎఫ్ సీఐ ప్రభుత్వ ప్రైవేట్ గోదాము,ఎయిర్ హౌస్, ఆర్టిసి ట్రాన్స్పోర్ట్ బజార్ (హమాలి) కార్మికులు వీరిని కొన్ని ప్రాంతాలలో జట్టు మూట కలాసి హమాలి దడవాయి లాంటి పేర్లతో పిలుస్తారన్నారు. వీరికి పాలకులు నేటికీ ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు రూపొందించక పోవడం కార్మికుల పైన పాలకవర్గాలకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో మనకు అర్థమవుతున్నదన్నారు.ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలలో వీరు ముందున్నారని, తెలంగాణ రాష్ట్రం 2014 లో ఏర్పడిన నుండి నేటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి హమాలీ కార్మికుల సమస్యలపై అనేకసార్లు మంత్రులకు,ఎమ్మెల్యేలకు, అధికారులకు వినవించిన నేటి వరకు ఏమాత్రం చట్టాలను చేయడంలో ప్రభుత్వాలు చొరవ చూపడం లేదన్నారు. గత ప్రభుత్వాల వెలుగులో నేటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా నడుస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికుల సమస్యల అధ్యయనం కొరకు అమృతసేన్ కమిషన్ ను నియమించిందని, ఈ కమిషన్ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2008లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర కార్మికుల స్థితిగతులు పరిశీలించి రూల్స్ రూపొందించుకోవాలని సూచనలు చేసిన 17ఏళ్లు గడుస్తున్నా వీరిపై కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని అన్నారు. పొద్దంతా మూటలు మోసి పనిచేసిన పూట గడవడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలీ కార్మికుల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని పీఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ తో పాటు ఉపాధి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 282 జీవోను తెచ్చి పని గంటల భారం మోపుతుందని దీని రద్దు చేయాలని కోరారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇన్సూరెన్స్ పెన్షన్ కనీసం రూ.9000 ఇవ్వాలని సమావేశంలొ అన్నారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా కె.రాజేశ్వర్, గంగాధర్, రాజన్న, నర్సయ్య, సుమన్, కిషన్, చిన్న నర్సయ్య, బుచ్చన్న,హమాలీలు.కార్మికులు, పాల్గొన్నారు.