26.3 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంగ్రెస్ పార్టీ లో ప్రతి కార్యకర్తను ఎల్లప్పుడూ ఆదుకుంటా

 

. . . మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రాబోయే ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ పై అవగాహన, బాన్సువాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వివరించారు. కొంతమంది నాయకులు నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, నేను బాన్సువాడలోనే ఉంటూ, కాంగ్రెస్ పార్టీకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇందూరి సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

It is certain that the Congress party flag will fly high in the Banswada constituency...

More articles

Latest article