30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎల్ఓసి అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామానికి చెందిన మహమ్మద్ షరీఫ్ గత కొంత కాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లొ చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు ఆపరేషన్ అవసరమని వైద్యులు సూచించారు. ఆపరేషన్ కొరకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుండడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులచే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించారు. ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.2.50లక్షల ఎల్ఓసిని  అందించారు. ఈ సందర్భంలో మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఆపద సమయంలో ఆదుకున్న స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ముత్యాల సునీల్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక  ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article