- క్రీడా స్ఫూర్తితో ముగిసిన 16వ ఈశా గ్రామోత్సవ క్రీడలు
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : గత రెండు రోజుల నుండి జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ప్రారంభమైన ఈసా ఫౌండేషన్ క్రీడలు నేటితో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో పౌండేషన్ ప్రతినిధులు అట్టహాసంగా ముగించారు. ఇందులో 20 వాలీబాల్ జట్లు పాల్గొనగా, 5 త్రో బాల్ జట్లు పాల్గొన్నాయి. ఆటగాళ్ళు ఇంకా గ్రామోత్సవ కార్యక్రమానికి తిలకించడానికి విచ్చేసిన వారందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నట్లు ఈషా ఫౌండేషన్ ప్రతినిధులు, వాలంటీర్లు తెలిపారు. వాలంటీర్లు పూర్తి నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

17న జరిగిన ఫైనల్స్ లో వాలీబాల్ బాల్ నుంచి కమ్మరపల్లి మొదటి స్థానం, కొండాపూర్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మహిళలకు జరిగిన త్రో బాల్ లో నడపల్లి తండా వారియర్స్ కి మొదటి స్థానం, పవర్ వారియర్స్ రెండవ స్థానాన్ని గెలుచుకున్నారు. 2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించడమైంది అన్నారు.

ఈశా గ్రామోత్సవంలో ఇప్పటివరకు 8,412 జట్లు, 1,00,167 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఏడాది 126 ప్రదేశాల నుండి 80,000 మందికిపైగా క్రీడాకారులుపాల్గొంటున్నట్లు చెప్పారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు క్లస్టర్, డివిజనల్, ఫైనల్ దశల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. సద్గురు ఇంకా వేలాది మంది సమక్షంలో ఫైనల్ ఈవెంట్ ఈ ఏడాది డిసెంబర్ 28న ఈశా యోగా సెంటర్, కోయంబత్తూరులోని ఆదియోగి వద్ద నిర్వహించబడుతుందన్నారు. విజేత జట్లకు ఈశా రిజువినేషన్ ట్రోఫీ నగదు బహుమతులను వాలీబాల్ క్రీడల్లో పురుషులకు రూ. 5 లక్షలు, త్రో బాల్ క్రీడల్లో భాగంగామహిళలకు రూ. 5 లక్షలు. మొత్తంగా కోటి రూపాయలకు పైగా నగదు బహుమతులను అందజేశారు.
