రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ భర్త మృతి

0 1,320
  •  చుక్కా పూర్ లో విషాద ఛాయలు

బతుకమ్మ,మాచారెడ్డి: మాచారెడ్డి మండలం చుక్కా పూర్ మాజీ సర్పంచ్ భర్త వోడపల్లి నర్సింగరావు (53) రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. ఈ విషయం తెలియడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చుక్కా పూర్ గ్రామం నుండి మాచారెడ్డి క్రాస్ రోడ్డు కు తన కూతురు ను, మరొక అబ్బాయిని వెంట బెట్టుకుని బైక్ పై వెళ్తున్నాడు. మాచారెడ్డి బస్టాండ్ నుండి ఆర్టీసీ మెయిన్ రోడ్డు ఎక్కుతున్న సమయం లో ఆర్టీసీ బస్సు డ్రైవర్, మరియు మృతుడు నర్సింగరావు పరస్పరం గమనించారు. ఇరువురు తమ వాహనాలను ఆపారు. తిరిగి ఇద్దరూ ఒకే సారి స్టార్ట్ కావడం తో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వివరించారు. బస్ ఢీ కొట్టడంతో ఆయన కింది పడిపోయాడు. తల కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆయన వెంట ఉన్న పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. నర్సింగరావు అకాల మరణంతో చుక్కా పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave A Reply

Your email address will not be published.