27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపాలిటీగా బిచ్కుంద..?

Must read

📰 Generate e-Paper Clip

  • ముడు గ్రామాల విలీనం తో బల్ధియా ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోపన్ పల్లి గ్రామస్తులు

 

బతుకమ్మ, బిచ్కుంద : ఉమ్మడి జిల్లాలో ఏకైక ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం జుక్కల్ లో తొలి మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంను అభివృద్ధి చేస్తానని ప్రజలకు హమీ ఇచ్చిన తోట కాంతారావు ఆ దిశలో పని చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలలో 7 కానిసిస్టేంన్సిలలో బల్ధియాలు ఉండగా మారుముల ప్రాంతంగా అభివృద్ధి కి దూరంగా ఉన్న జుక్కల్ లో అసలు పంచాయతీ మినహ బల్ధియా లేవు. ఈ నేపథ్యంలో గత ఏడాది ప్రస్తుత ఎమ్మెల్యే కాంతారావు నియోజకవర్గం కేంద్రంగా బాసిల్లుతున్న బిచ్కుందను మున్సిపాలిటీగా చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నట్టు భావించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మండలం మునిసిపాలిటీ గా రూపు దిద్దుకుంటుందని ఆ నోట ఈ నోట గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన నియోజకవర్గంగా జుక్కల్ నియోజకవర్గం పేరు ఉండడం పేరుకు మాత్రమే “జుక్కల్” మండలానికి ఎక్కువ నియోజకవర్గం కేంద్రానికి తక్కువగా పేరుగాంచింది. జుక్కల్ నియోజకవర్గంకు కేంద్రంగా బిచ్కుంద ఉండటంతో పాటు వర్తక వాణిజ్య కేంద్రంగా సర్వహంగులు ఉండటంతో బిచ్కుంద మున్సిపాలిటీగా రూపు దిద్దుకుంటుందని పలువురు భావిస్తున్నారు.

1955 జనవరి 26న గ్రామపంచాయతీగా అవతరించిన బిచ్కుంద అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలోనే ఉంది. మున్సిపాలిటీగా అవతరించినట్లయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజా సౌకర్యార్థం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయనున్నామని పలువురు ప్రజాప్రతినిధులు హమీలు కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత ఎమ్మెల్యే చొరవతో మండల అధికారులు మున్సిపాలిటీ కొరకై ప్రతిపాదనలు పంపడం జరిగింది. జనాభావిస్తీర్ణం ను దృష్టిలో ఉంచుకొని బిచ్కుందను ఆనుకుని ఉన్న కాందార్పల్లి, గోపన్ పల్లి, దౌల్తాపూర్ గ్రామాలను బిచ్కుంద బల్ధియాలో విలీనం కోసం గ్రామపంచాయతీల నుండి తీర్మానాలను తీసుకొని ప్రతిపాదనలు  పంపినట్లు ఎంపీడీవో గోపాలకృష్ణ బతుకమ్మతో తెలిపారు.

బిచ్కుంద మండలం గోపన్ పల్లి గ్రామానికి చెందిన ప్రజలందరూ  మా ప్రమేయం లేకుండా మా అభిప్రాయం సేకరణ చేయకుండా మీరు ఎలా నిర్ణయం తీసుకుంటారు. మేం ససేమీరా మున్సిపాలిటీలో కలిసేది లేదని మేము మా ఊరి గ్రామపంచాయతీ పరిధిలోనే ఉంటామని మేము మున్సిపాలిటీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. గ్రామ ప్రజలందరూ ధర్నా రాస్తారోకో నిర్వహించి ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. బిచ్కుంధ మున్సిపాలిటీ గనక అయినట్లయితే ప్రాంతం అభివృద్ధి చెందుతుందని భూములకు ధరలు వస్తాయని రోడ్ల విస్తరణ జరుగుతుందని వ్యాపార సముదాయాల విస్తీర్ణం మరింతగా అభివృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిరుపేద రైతులకు ఉపాధిక కూలీలకు ఉపాధి హామీ పథకం పోతుందని అలాగే టాక్స్ ల భారం తడిసి మోపెడు అవుతుందని చిన్న కారు సన్న కారు వ్యక్తులు గృహ నిర్మాణం చేసుకోవాలన్నఒక ప్లాటు ఖరీదు చేయాలన్న వారి ఆశలు అడియాశలు అవుతాయని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. బిచ్కుంధ మున్సిపాలిటీ ఏర్పాటు వల్ల ఎవరికి లాభం చేకూరుతుందో.. ఎవరికి నష్టం చేకూరుతుందో గాని ప్రస్తుతానికి బిచ్కుందకు మున్సిపాలిటీ అనే ఫీవర్ పట్టుకుందని పలువురు ఆ నోట ఈ నోట గుసగుసలాడుకుంటున్నారు.

Is Bichkunda a municipality?

More articles

Latest article