27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రైవేటు బడిలో సెంటరు.. ఫలితాల కోసం తంటాలు

Must read

📰 Generate e-Paper Clip

  • సిఎస్, ఇన్విజిలేటర్లు పాతవారే

 

నిజామాబాద్, బతుకమ్మ:

పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను రాబట్టుకునేందుకు మొదటి పరీక్షా నుంచే చూచిరాతలను ప్రోత్సహిస్తున్నారు. దీని కోసం చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లను ఇంతకు ముందు పని చేసిన వారినే ఏరికోరి నియమించారు. విద్యార్థులకు విద్యను బోధించడంలో నిర్లక్ష్యం వహించి, ప్రస్తుతం పరీక్షల సమయంలో ఫలితాల కోసం తంటాలు పడుతున్నారు.

మాక్లూర్ మండలంలోని మాణిక్ భండర్ గ్రామంలో గల ఉన్నత పాటశాల పదవ తరగతి విద్యార్థులకు దాస్ నగర్ సమీపంలోని ప్రైవేటు బడిలో పరీక్ష రాసేందుకు సెంటర్ వేసారు. వీరిని ఉత్తీర్ణులు గావించేందుకు గాను సర్కారు ఉపాద్యాయులు నానాయాతనలు పడుతున్నారు. ఫలితాలలో తేడా వస్తే ఆ గ్రామ పెద్దల ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. పిల్లలకు ఎలాగూ పాఠాలు సరిగా చెప్పలేదు, పదిలోనైన గట్టేక్కిద్దామని కూడగట్టుకొని చూచి రాతలు రాయిస్తున్నారు.

  • సెంటర్లో పాతవారు …

పరీక్షల సమయంలో సెంటర్లో ఒకసారి పని చేసినవారు మరొకసారి చేయరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ గతంలో సిఎస్, ఇన్విజిలేటర్లుగా పని చేసిన వారినే మళ్ళీ నియమించిన విషయం గ్రామస్తుల చెవిన పడినట్లు తెలిసింది.
పాఠశాలలు నడిచినప్పుడు ఉపాద్యాయులు రాకపోవడం, వచ్చినా చదువు చెప్పకపోవడాన్ని పిల్లల తల్లిదండ్రులు ఓ కంట గమనిస్తూనే వస్తున్నారు. మార్కుల కోసం గాకుండా విద్యార్థి స్వతహాగా రాసి ఉత్తీర్ణుడు అయ్యేలా చూస్తే పై చదువులకు ఉపయుక్తంగా ఉంటుంది. సెంటర్లో మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్న పాతవారిని తొలగించాలనే డిమాండ్ ఉపాద్యాయులు, పిల్లల తల్లిదండ్రుల నుంచి వస్తోంది.

More articles

Latest article