27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సాగునీటి ని పొదుపుగా వాడుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం
  •  మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ, నవీపేట్ : గోదావరి లో తగినంతగా నీరు లేకపోయిన పొట్టకు వచ్చిన పంటలకు సంవృద్దిగా నీరు అందించన్న రైతుల కోరిక మేరకు సాగునీటి ని విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. అలీసాగర్ ఎత్తిపోతల సాగునీటి ని శుక్రవారం నాడు మండలం లోని కోస్లీ గోదావరి పంప్ హౌస్ వద్ద మోటార్ లను స్టార్ట్ చేసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి లో తగినంతగా నీరు లేకపోయిన నిండు పొట్టలో ఉన్న పంటలకు సాగునీటిని అందించాలన్న రైతుల సూచనల మేరకు అలీసాగర్ నీటిని విడుదల చేస్తున్నామని, రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకుంటే రెండో పంటకు ఉపయోగించుకోవచ్చని సూచించారు.

Irrigation water should be used sparingly

ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తాం..

ప్రతీ రైతుకు రుణమాఫీ చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని కోరారు. జాతీయ బ్యాంకు లలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సేకరిస్తారని, సొసైటీ లలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సెక్రెటరీ లు, సొసైటీ చైర్మన్ లు సేకరించాలని ఆదేశించారు. సొసైటీ లలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సొసైటీ అధికారులు రైతులకు సహకరించని యెడల ఆర్డీవో, కు లేదా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించేందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామాలకు వస్తారని, రైతులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్స్ లను ధ్వంసం చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పంటలు ఎండకుండా, విద్యుత్ అధికారులు వెంటనే ట్రాన్స్ఫార్మర్స్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రైతులు గస్తీలు ఏర్పాటు చెడుకుంటూ ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు ట్రాన్స్ఫార్మర్స్ దొంగలను త్వరలో పట్టుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు , ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హుందాన్, ఇరిగేషన్, రెవెన్యూ, అధికారులు, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు రాజేందర్ కుమార్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కిషన్ రావు, సంజీవరెడ్డి, మోస్రా సాయి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Irrigation water should be used sparingly

 

More articles

Latest article