26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఉమెన్స్ హెల్పింగ్ హ్యండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉమెన్స్ హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లోని న్యూ ఎన్జీవోస్ కాలనీలోని స్నేహ సొసైటీ స్కూల్ లో శనివారం 80మంది  విద్యార్థులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఆయాలను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి

International Women's Day under the auspices of the Women's Helping Hands Organization

మాట్లాడుతూ పాఠశాల మహిళా దినోత్సవం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం, విద్యార్థులకు బిస్కెట్లు, స్వీటులు పంచడం ఆనందంగా వుంది అని అన్నారు. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో ఉమెన్స్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో సభ్యులు కలిసి నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు, మహిళా ఉపాద్యాయినులు, సిహెచ్. వరలక్ష్మి, సుచరిత, సునీత, సుజని, ప్రయాగ, ధనలక్ష్మి పాల్గొన్నారు.

International Women's Day under the auspices of the Women's Helping Hands Organization

More articles

Latest article