నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జన్మదిన వేడుకలు నగరంలోని బాల సదన్ లోని బాలికల మధ్యన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ హెడ్ చీఫ్ రాజ్ కుమార్ సుబేదార్ హాజరై మాట్లాడారు. సౌమ్యుడు, మృదు స్వవబి అయినా జగన్ అందర్నీ కలుపుకొనిబోతూ ఈరోజు న్యాయవాద అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నరు. ఆయన జన్మదిన సందర్భంగా పిల్లల మధ్య జరుపుకోవడం శుభ పరిణామం అని అన్నారు. విద్యార్థులు కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్మోహన్ గౌడ్, వసంతరావు, విగ్నేష్, లక్ష్మణ్, పిల్లి శ్రీకాంత్, సుజిత్, నాగ సురేష్, ప్రకాష్, యనిఎస్ ఖాన్, గోవర్ధన్, జైపాల్, అయ్యూబ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

