ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శనివారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 15 లక్షల నిధులతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పలు సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ఇందల్వాయి గ్రామానికి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కాంట్రాక్టర్ సంతోష్ రెడ్డి, మోత్కూరి నవీన్ గౌడ్ ఉన్నారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని మండల శాఖ అధ్యక్షులు మోత్కూర్ నవీన్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజులలో ఎమ్మెల్యే సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఈర్ల సాహెందర్, గ్రామ విడీసీ అధ్యక్షులు జితేందర్, మాజీ ఎంపీటీసీ మారంపల్లి సుధాకర్, పంచాయతీ కార్యదర్శి భరత్, బైరి రవి,ఎరుకల ప్రసాద్, మాదరి గంగారం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
