- జిల్లా వ్యాప్తంగా పరీక్షలు రాయనున్న36,222 మంది విద్యార్థులు
- 57 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
- ఐదు నిమిషాల వరకు సడలింపు
నిజామాబాద్, బతుకమ్మ : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 36,222 మంది విద్యార్థులు హాజరుకానున్నారని,వీరి కోసం మొత్తం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలు 25వ తేదీ వరకు కొనసాగుతాయని , ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. అయితే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించని విషయంలో బోర్డు ఐదు నిమిషాల వరకు సడలింపు ఇచ్చింది. జిల్లాలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 15,053కాగా ఒకేషనల్ విద్యార్థులు 2736 మొదటి సంవత్సరం మొత్తం 17,789విద్యార్థులు హాజరు కానున్నారు. రెండవ సంవత్సరం జనరల్ రెగ్యులర్ 13,944 మంది విద్యార్థులు,ప్రైవేటు(సప్లిమెంటరీ) 2128 మంది విద్యార్థులు,ఒకేషనల్ రెండవ సంవత్సరం రెగ్యులర్ 2042 మంది విద్యార్థులు,ప్రైవేటు 319మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో,రెండు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు,రెండు సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు,7 మోడల్ జూనియర్ కళాశాలలు,రెండు మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు,ఒక బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, 26 ప్రైవేటు జూనియర్ కళాశాలలు,ఒక ప్రభుత్వ హై స్కూల్ ను పరీక్ష కేంద్రాలుగా కేటాయించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలలో 18,469మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు.ఇందులో మొదటి సంవత్సరంలో 8743 మంది కాగా, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలు రాయనున్నారు.
- సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు..
నిజామాబాద్ జిల్లాలోని 57 పరీక్ష కేంద్రాలను ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 8 మంది సిటింగ్ స్కాడ్ లు,ఒక హైపవర్ కమిటీ,జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ముగ్గురు తనిఖీలు చేయనుంది. విద్యార్థులు ఎలాంటి చీటీలు తీసుకొచ్చిన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేస్తారు.
