32.1 C
Hyderabad

పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహితను మోసం చేసిన ఇన్స్ పెక్టర్

Inspector deceives married woman after promising marriage.

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

సైదారాబాద్ పోలీస్ స్టేషన్‌లో డీఐగా విధులు నిర్వహిస్తున్న ఇన్స్ పెక్టర్ బాలస్వామి ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఘటన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ పని చేస్తున్న బాల స్వామి వివాహిత భర్త మంచాన పడడంతో ఆమెపై కన్నేసిన ఆయన నీ భర్త ఎక్కువ రోజులు బతకడని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు.  అప్పటికే అతనికి పెళ్లి జరిగిందని తెలిసి మహిళ బాలస్వామిని నిలదీయగా విడాకులయ్యాయని మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధం కొనసాగించిందని తెలిపింది. భార్య, పిల్లలు ఉన్నారని తెలిసి ఆమె మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More articles

Latest article