23.3 C
Hyderabad

తులం బంగారం ఇవ్వాల్సిందే

A tola of gold must be given.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఆదివారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ పథకంపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పథకం నిలిపివేస్తారనే పుకార్లు వస్తున్నాయన్నారు. దీనిపై అధికారులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తుందని, కనీసం హామీ ఇచ్చిన సమయంలో ఉన్న ధరకే బంగారం ఇవ్వాలన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నమోదు చేసుకున్న లబ్ధిదారులకు తొందరగా అందజేయాలని సూచించారు. మొత్తం 275 మంది లబ్ధిదారులకు 2.75 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ,నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, జగదీష్ కులకర్ణి, న్యాలం సునీత రాజు, బంటు ప్రీతి ప్రవీణ్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, నాయకులు పంచరెడ్డి శ్యామ్, పవన్ ముందడ తదితరులు పాల్గొన్నారు.

A tola of gold must be given.
 

More articles

Latest article