27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరి కొనుగోలు కేంద్రాల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల : మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామములో ప్రభుత్వం వరి కొనుగోలు సెంటర్ ను  రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్,  రాష్ట్ర కాంగ్రెస్ కిషన్ ఖేతు అధ్యక్షులు సుంకెట అన్వేష్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వరికి క్వింటాలుకు ఐదు నుంచి ఎనిమిది కిలోల వరకు కడుత తీసుకొని రైతులను మోసం చేసి జేబులో నింపుకొన్నారని, ఇప్పుడు అలాకాకుండా కడుత లేకుండానే వడ్లను ప్రభుత్వం తీసుకొన్న తర్వాత కాంటా అయిన మూడు నాలుగు రోజులలోని గతంలో ఎప్పడు లేని విధంగా రైతు ఖాతాలో డబ్బులు పడుతున్నావని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికాలలో మాట ఇచ్చినా ప్రకారం సన్నా వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ కూడా వారంలోపు వెయ్యడం జరుగుతుందని కావున ప్రతి రైతు ప్రభుత్వ వరీ కొనుగులు కేంద్రాలను ఉపయోగించుకోవాలని కోరారు.త్వరలోనే రైతు భరోసా డబ్బులు,  మిగిలి పోయిన రైతు రుణ మాఫీ డబ్బులు బడ్జెట్ ప్రకారం రైతుల ఖాతాలో జమ చేయడం ఖాయమని ఎవరు కూడా అధైర్యపడవద్దని ప్రతిపక్షాల మాటలను నమ్మవద్దని ఓపిక పట్టాలని కోరారు.రైతులు కూడ వ్యవసాయ విత్తనాలు తీసుకొనే ముందు అన్ని ఆలోచించి ప్రభుత్వం గుర్తింపు కంపెనీవి నాటుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇట్టి కార్యక్రమములో తాళ్ల రాంపూర్ సొసైటి చైర్మెన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోమ దేవరెడ్డి, బాల్కొండ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడేపు గంగ ప్రసాద్,మార్కెట్ డైరెక్టర్ కొర్రుపల్లి లింగారెడ్డి, ముస్కు మోహన్ రెడ్డి, దేశవోయిన సంజీవ్ యాదవ్,దోంచంద వెంకటరెడ్డి, నాగేంద్ర కాలనీ శాంషేన్, రాంపూర్ కొట్టాల శ్రీనివాస్,మధు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article