29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సమగ్ర కులగణన చైతన్య యాత్ర 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్  : సమగ్ర కుల గణన చైతన్య యాత్ర లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల  శ్రీనివాస్ ఈ నెల 21న గురువారం నిజామాబాద్ వస్తున్నారు అని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ తెలిపారు. ఆ రోజు కులగణన చైతన్య సదస్సు అన్ని కులాల నాయకులతో నిజామాబాద్ నగరంలో జాజుల శ్రీనివాస్ గౌడ్ సదస్సు నిర్వహించనున్నారని,  సదస్సులో అన్ని బీసీ కుల సంఘాలు నాయకులు పాల్గొనాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సమావేశం అనంతరం కులగణన తీరు పనులని పరిశీలించడానికి ఒక  గ్రామాన్ని సందర్శించి, ప్రజలను, ఎన్యుమీటరేటర్ లను కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతారు అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగాకిషన్, కరిపే రవిందర్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత గంగాధర్, సంతోష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article