. . . తీవ్రంగా ఖండించిన టియూసిఐ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తారని విమర్శలు అక్షర సత్యాలు అని రుజువైంది. నగరంలో కుండ పోత వర్షంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల పట్ల డిప్యూటి కమీషనర్ వ్యవహరించిన తీరు వివాదస్పధమౌతుంది. గురువారం ఉదయం నగరంలో భారీ వర్షం కురుస్తుండగా ఒకవైపు మున్సిపల్ కార్మికులు రెయిన్ కోటు ఇతర రక్షణ పరికరాలు ఏవి లేకుండా, ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. రెయిన్ కోట్ వేసుకొని డిప్యూటీ కమిషనర్ రవి బాబు పర్యవేక్షణ చేస్తూ, ఒక కార్మికుడితో గొడుగు పట్టించుకోవడం పై విమర్శలు వస్తున్నాయి. సంబంధిత వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మున్సిపల్ కార్మికుల పట్ల అధికారులు వివక్షను,నిర్లక్ష్య వైఖరిని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా( టి యు సి ఐ) తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ ఒ ప్రకటన విడుదల చేశారు. కార్మికులకు రక్షణ పరికరాలు, ముఖ్యంగా వర్షాకాలంలో రెయిన్ కోట్లు ఇవ్వాలి టి యు సి ఐ గా, కార్మిక సంఘాల జేఏసీ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందించని అధికారులు మొండి వైఖరిని నిరసిస్తున్నారు . వెంటనే మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్లు రక్షణ పరికరాలు అందివ్వాలని డిమాండ్ చేశారు.

