వెబ్ డెస్క్, బతుకమ్మ : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ లో ఇండియా, కివిస్ మధ్య జరిగిన ఫైనల్ లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిసి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 49 ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 252పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ నాలుగు వికెట్లతో ఘన విజయం సాధించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి. భారత్ ఒపెనర్లు క్యాప్టెన్ రోహిత్ శర్మ 76(83 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్స్ లు), శుభ్ మన్ గిల్(31), శ్రేయస్ అయ్యర్ (48, 62బంతుల్లో), కేఎల్ రాహుల్ (34 నాటౌట్, 33బంతుల్లో) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో సాంటనర్, బ్రాస్ వెల్ చెరో రెండు వికెట్లు తీయగా, జెమిసన్ ఒక వికెట్ తీశాడు.
